బ్లాగు (WHAT IS BLOG)

మీ అభిప్రయాలను ఇతరులతొ పంచుకొవడానికి ఇంటర్నెట్లొ ఉపయొగించే వేదికనే వ్లాగు అంటారు.బ్లాగుని తయారుచెయ్యటం చాలా సులభం.ఈ రొజు ఇంటర్నెట్లొ బ్లాగు తయారుచేసుకోవటానికి చాలా మంచి సైట్లు ఉన్నయి. వాటీలొ కొన్ని www.wordpress.com ,www.ibibo.com మరియు గూగుల్ వారి www.blogger.com. మీకు Gmail అకౌంటు ఉంటె వెంటనే www.blogger.com లొకి వెళ్ళి మీ Gmail అకౌంటుతో ఆ సైటులొ లాగ్ ఇన్ అవ్వండి.మీరు లాగ్ ఇన్ అయిన వెంటనే మీరు ఏ పేరుతో మీ బ్లాగుని తయారు చెయాలనుకుంఋన్నారొ ఆ పేరు ని టైపు చెయ్యండి.


ఉదా: "silly-google" అనే పేరుతొ మీకు బ్లాగు కావాలంటే మీ బ్లాగు అడ్రస్సు http://chilipigoogle.blogspot.com అని వొస్తుంది.మీరు కావాలనుకుంటున్న పేరుతొ మీకు బ్లాగు రాకపోతే ఇంతక ముందే ఆ పేరుతొ ఎవరో బ్లాగు తయారు చేసుంటారు కాబట్టి మీరు వేరే పేరు పెట్టండి.


మీ బ్లాగుకి పేరు పెట్టీన తరువాత మీ బ్లాగులొ మీరు ఏ విషయం గురించి చెప్పాలనుకుంటున్నారొ ఆ విషయాన్ని మీకు నచ్చిన బాషలొ టైపు చేసుకునే వీలు కూడా www.blogger.com లొ ఉంది.ఈ బ్లాగు లాగా తెలుగులో టైపు చెయ్యడానికి http://lekhini.org లేకుంటె www.orkut.com స్క్రాప్ బుక్ లొ తెలుగు ఎంచుకొని టైపు చెయ్యండి.అక్కడ కాపి చేసి మీ బ్లాగు లొ పొస్టు చెయ్యండి.

ఇంటర్నెట్లొ తెలుగు టైపు చెయ్యాడానికి చాలా సమయం పడుతుంది.ఇంటర్నెట్ లేకుండా మన సొంత కంప్యూటర్ ఉంటే అందులో baraaha అనే softwareతో టైపు చెసి సేవ్ చెయ్య్డిండి.నెట్టులొ ఉన్నప్పుడు మీ సిస్టంలో మీరు టైపు చేసి సేవ్ చేసిన ఉన్న విషయాన్ని బ్లాగులో కాపి చెయ్యండి.

మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.
మీ
చిలిపి గూగుల్
silly-google