చిలిపి గూగుల్ (GOOGLE HISTORY)

ఈ రోజు ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలిసినది ప్రతి ఒక్కరు వుపయోగించేది ఏంటో మీ అందరికి తెలుసు అదే "google" .ఈ విశాలమయిన ఇంటర్నెట్ ప్రపంచంలో ఏది కావాలన్న క్షణాల్లో మన ముందు తీసుకొని రాగల శక్తి తనకుంది. ఈ రోజు గూగుల్ అనే సైట్ ఇంటర్నెట్లో లేదనుకొని దానిని వాడకుండా మనకు కావలసిన వన్ని ఇంటర్నెట్లో చూడాలనుకుంటే అది చాల కష్టంతో కూడుకున్న పని అని మీ అందరికి తెలుసు ఇలాంటివి అంటే గూగుల్ లాంటి సైట్స్ నెట్లో చాల వున్నాయికదా అని మీరు అనుకోవచ్చు కాని ఇది ఇచ్చినంత కచ్చితమైన వివరాలు ఇతర అ సైట్ లోనూ మనం పొందలేము. సెర్చ్ ఇంజన్ గా మొదలైన గూగుల్ నేడు ఎన్నో సేవలను అందిస్తోంది.వాటిలో ముఖ్యం గా చెప్పుకోవలసినవి "జిమెయిల్ ", "ఆర్కుట్" ,"యు ట్యూబ్ ".ఇవే కాకుండా నేడు ఇంటర్నెట్లో అడ్వర్టైజ్మెంట్లు (వ్యాపార ప్రకటనలు) చేసే సరికొత్త అడుగుని వేసి ఎంతోమందికి వుపయోగాపడుతోంది.సొంతంగా వెబ్సైట్ వున్నా వారేవేరైన గూగ్లేతో చేతులు కలుపవచ్చు.మన సైటులో మనకు నచ్చిన విధంగా ప్రకటనలను వుంచి వాటి ద్వారా మనమూ ఆదాయం పొందవచ్చు.దీనినే "adsense" అని అంటారు.అలాగే మన సైట్ ని గూగ్లేలో "advertise" చెయ్యవచ్చు ఇలా చేయడాన్ని "adwords" అని అంటారు.వీటన్నింటి గురుంచి ఈ బ్లాగులో వివరంగా చర్చించడం జరుగుతుంది.ముందు అసలు మీకు గూగుల్ ఎప్పటినుంచి తెలుసు గూగుల్ ఎలా వుండేదో మీకు తెలుసా ఇక్కడ చూడండి. EENATI EE GOOGLE

అలనాటి గూగుల్ ని చూడాలని చాల మందికి అనిపిస్తుంది మీ అందరి కోసం గూగ్లేని ఇక్కడ వుంచడం జరిగింది చూడండి.ఇక్కడ క్లిక్ చెయ్యండి